Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వనజ:సమీక్ష

Telugu విష్ణుభొట్ల లక్ష్మన్న
పరిచయం ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప తెలుగు సినిమా నేను చూడలేదు. సినిమా చూసిన తరవాత పదే పదే గుర్తుకు వచ్చిన సినిమా “వనజ”. తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తియ్యగల దర్శక, నిర్మాలే కాకుండా, సినిమా తియ్యటంలోని అన్ని విషయాల్లో ప్రతిభ కనపరచిన సినిమా “వనజ”. అనుకోకుండా అంతర్జాలంలో కనిపించిన సినిమా “వనజ”. చూసిన తరవాత చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయా! మళ్ళీ చూసా! మళ్ళీ మళ్ళీ చూసా! నవతరంగం సినిమా మిత్రులకి వనజ గురించి తెలిసే [...]
పూర్తిగా చదవండి

కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’

Telugu K మహేశ్ కుమార్
జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన [...]
పూర్తిగా చదవండి

గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష

Telugu K మహేశ్ కుమార్
ఈ మధ్య నా దగ్గరున్న కొన్ని తెలుగు పుస్తకాల బూజుదులిపి చదవడం మొదలెట్టాను. అందులో ఒకటి ‘సినీరమణీయం 1’ అని, ముళ్ళపూడి వెంకటరమణ గారి సినీ వ్యాసాల, సమీక్షలు,కథల సంకలనం. దాంట్లో 129 వపేజీ కొచ్చేసరికీ నా కళ్ళు కాస్త పెద్దవయ్యాయి. ఇప్పటివరకూ నాకు నచ్చిన హిందీ చిత్రాలలో ప్రముఖమైనది గురుదత్ ‘ప్యాసా’ प्यासा  (1956). రమణగారి కలంనుంచీ ఆ సినిమా సమీక్ష అక్కడ కనబడింది. పూర్తి సమీక్ష ఉత్సాహంగా చదివేసరికీ, నిజం చెప్పాలంటే నీరసమొచ్చింది. ‘చచ్చినవాడి కళ్ళు [...]
పూర్తిగా చదవండి

బెలా టర్ - ఒక పరిచయం

Telugu శిద్దారెడ్డి వెంకట్
హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు. 1955లో హంగరీ దేశంలో జన్మించిన Bela [...]
పూర్తిగా చదవండి

మునికన్నడి సేద్యం -సమీక్ష

Telugu పొద్దు
-రానారె మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి - ఇదీ మునికన్నడి కుటుంబం. ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వాలతో, బలాలతో, బలహీనతలతో, గుణాలతో ఒక్కో మనిషి సజీవంగా మన ముందు తిరుగాడినట్లే వుంటుంది. కష్టించి పనిచెయ్యడానికి వెరపు లేని కుటుంబం. [...]
పూర్తిగా చదవండి

‘పరుగు’ - ఒక సామాజిక విశ్లేషణ

పరుగు, పెళ్ళి, ప్రేమ, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
ఇప్పటివరకూ ‘పరుగు’ సినిమా సమీక్షలు చాలానే చదవటం జరిగింది. కానీ ఇప్పుడే నేను సినిమా చూశా! నేను చదివిన సమీక్షలలో, “బొమ్మరిల్లు అంత బాగాలేదు” అనే తులనాత్మక జడ్జిమెంటో, లేక “పరుగు సినిమా స్పీడ్ తగ్గింది” అని సినిమా నడిపిన వేగం గురించో, మహా ఐతే “ఇది చిరంజీవి కూతిరి కథలా ఉంది” అనో సింపుల్గా తేల్చెయ్యడం జరిగింది. కానీ చూసిన వెంఠనే నా కనిపించిన మొదటి భావం “హమ్మయ్య మనుషులగురించి ఒక కమర్షియల్ హీరో సినిమా [...]
పూర్తిగా చదవండి

Kantri Ante NTR anI

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
పూర్తిగా చదవండి

కంత్రి సమీక్ష

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఈ సమీక్షలో వ్యక్తపరచబడ్డవి రచయిత అభిప్రాయములగా భావించగలరు. ఇతర రచయితలు ఇదే సినిమా గురించి వేరే విధంగా భావించవచ్చని గమనించగలరు. పేరుకు తగ్గట్లుగానే (kaNTRi) ఈ చిత్రంలో జూనియర్ యన్.టి.అర్. గురించి తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఎమీ లేదు. ఈ చిత్ర మొదటి భాగం పోకిరి చిత్రాన్ని మరియు రెండవ భాగంలో కొంత శాతం మున్నా చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. కాని ఈ చిత్రం తారక్ మునుపటి చిత్రం యమదొంగ స్థాయిని చేరలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో ఒక [...]
పూర్తిగా చదవండి

ది నేం సేక్-సినిమా సమీక్ష

Jhumpa Lahiri, Mira Nair, Namesake, Tabu, భారతీయ సినిమా, సమీక్ష సాయి బ్రహ్మానందం గోర్తి
సాధారణంగా ఏదైనా నవలని వెండి తెరపై ఎక్కించడం అనుకున్నంత సులభం కాదు.ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడికే కాదు, చూసే ప్రేక్షకులకి కూడా ఒక రకమైన ఛాలెంజే! నవలలోని పాత్రల్నీ, సన్నివేశాల్నీ తెరపై చూపించే వాటితో పోల్చకుండా సినిమా చూడడం ఒకరకంగా అసాధ్యం! అసలు దర్శకుడు నవలనీ నవలలోని పాత్రలనీ అర్థం చేసుకున్నాడా, రచయిత చెప్పదల్చుకున్న విషయం సక్రమంగా తెరపైకెక్కించాడా లేదా అన్న సందేహం కలగడం సహజమే! కానీ దర్శకుడు ఒక నవలని యథాతధంగా తెరపై చిత్రీకరిస్తే అప్పుడు ప్రేక్షకులకి [...]
పూర్తిగా చదవండి

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

In the name of God, khuda kheliye, lollywood, pakistani films, ఖుదా కేలియే, పాకిస్తానీ సినిమాలు, ప్రపంచ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే [...]
పూర్తిగా చదవండి

పరుగు సమీక్ష

Allu Arjun, Bommarillu Bhaskar, parugu review, అల్లు అర్జున్, పరుగు సమీక్ష, బొమ్మరిల్లు భాస్కర్, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరుగు సినిమా వారిని థియటర్ వైపు పరుగులు తీయించకపోయినా, థియేటర్లో కూర్చోబెట్టగలుగుతుంది. బొమ్మరిల్లు తరవాత భాస్కర్ దర్శకత్వంలో దరిదాపు రెండేళ్ల తరువాత వచ్చిన సినిమా అవ్వడం చేత ప్రేక్షకులు ఈ సినిమా నుండి చాలా ఆశించారు, కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే అనాలి. కానీ దిల్ రాజు మునుపటి చిత్రం మున్నాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. అలాగే అల్లు అర్జున్ మునుపటి సినిమా దేశముదురు స్థాయికి ఈ [...]
పూర్తిగా చదవండి

నవతరంగానికి నాలుగు నెలలు

ప్రకటన, ప్రత్యేకం రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నూతనసంవత్సర శుభారంభ వేళ,మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ అంతర్జాలంలో ఎగిసిన కెరటం నవతరంగం,పాలపొంగులా, అలా.. అలలా ఆరంభశూరత్వమే కాక కాలక్రమంలో అర్ధవంతమైన సమాచారనిలయం గా మారింది.గడచిన నాలుగు నెలలలో వందలవ్యాసాలూ,విశ్లేషణలూ,వ్యాఖ్యానాలతో చలనచిత్రప్రియులను అశేషంగా ఆకట్టుకుంటుంది నవతరంగం. జల్సా, గోదావరి లొ గూఫులు,మై డిన్నర్ విత్ ఆంద్రె ,తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!, నిండు మనిషి -శోభన్,Travellers and Magicians – భూటాన్, తెలుగు సినిమా పరిస్థితి [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా K మహేశ్ కుమార్
“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం [...]
పూర్తిగా చదవండి

కల్తీ లేని చెత్త

సినిమా కొత్త పాళీ
ఈ మధ్యన ఇంటలెక్చువల్ పుస్తకాలు చదవడమూ ఇంటలెక్చువల్ సినిమాలు చూడడమూ ఎక్కువై పోయింది, బుర్రలో ...
పూర్తిగా చదవండి

చక్ దే - ఇండియా

తెలుగు, సమీక్ష, సినిమా venkat.siddareddy
భారత హాకీ టీము కెప్టెన్ కబీర్ ఖాన్. పాకిస్తాన్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ఫైనల్లో చివరి నిమిషంలో కబీర్ ఖాన్ కి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోవడంతో ఇండియా పరాజయం పాలవుతుంది. క్రీడల్లో గెలవడం, ఓడడం సహజమైనప్పటికీ ఆ జరిగిన మ్యాచ్ పాకిస్తాన్‌తో కావడం, కబీర్ ఖాన్ ఇస్లాం మతస్తుడు కావడం మాత్రమే కాకుండా, ఆట చివర్లో పాకిస్తాన్ ఆటగాళ్ళతో చనువుగా మెలగడం లాంటి అంశాలు కబీర్ ఖాన్‌ను అనుమానితుడ్ని చేస్తాయి. పాకిస్తాన్ గెలవడం కోసం గోలు చేసే అవకాశాన్ని కావాలని వదులుకున్నట్టుగా చిత్రీకరించిన మీడీయా ఆడిన ఆటలో బలయిపోతాడు కబీర్ ఖాన్. పర్యవశానంగా భారత హాకీ టీము నుండి వెలివేయబడతాడు.తనకు, తన వాళ్ళకు జరిగిన అవమానం భరించలేక ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కబీర్ ఖాన్.ఆ తర్వాత ఏడేళ్ళకు భారత మహిళా టీముకి కోచ్ గా తిరిగి వస్తాడు కబీర్ ఖాన్. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి, విభిన్న మనస్తత్వాలు కలిగిన పదహారు మంది యువతులను ఒక్క తాటిపై నడిపించి చివరకు ప్రపంచ కప్ ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS