Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Burn After Reading

Telugu శిద్దారెడ్డి వెంకట్
గత సంవత్సరం ఆస్కార్ అవార్డు అందుకున్న No Country for Old Men తో పాటు గతంలో Fargo, Barton Fink, The Big Lebowski లాంటి మంచి సినిమాలు రూపొందించిన Cohen బ్రదర్స్ కొత్త సినిమా ‘Burn After Reading’ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలయింది. Cohen బ్రదర్స్ అన్ని సినిమాలలాగే interesting premise వుంది ఈ సినిమాకి కూడా. వికిపీడియా నుంచి: “According to the Coens the plot will focus on the world of [...]
పూర్తిగా చదవండి

Atonement

Telugu శిద్దారెడ్డి వెంకట్
Atonement సినిమా చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నా ఎదో ఒక కారణం వలన ఇన్నాళ్ళూ చూడలేకపోయాను. పోయిన వారాంతరం ఎలాగో కుదుర్చుకుని వెళ్ళి ఈ సినిమా చూసాను. సినిమా మరీ గొప్పగా లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలలో ఇది ఒకటి. ఈ సినిమా మొదటి సగం ఒక రోజులో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడితే మిగిలిన సగం ఒక జీవిత కాలపు కథను కలిగి వుంటుంది. ఇది Briony మరియు Cecilia అనే ఇద్దరి [...]
పూర్తిగా చదవండి

నిమజ్జనం

Telugu వారాల ఆనంద్
తెలుగు చిత్రరంగంలో వాస్తవవాద దృక్పథంతో సినిమాలు నిర్మించి జాతీయస్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. ఆయన తన నలభై ఏళ్ళ సినీరంగ ప్రస్థానంలో 32 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఎక్కువ శాతం వ్యాపార చిత్రాలే. హెచ్.వి.బాబు, కె.బి.తిలక్, కె.ఎస్.ప్రకాశ్ రావు లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్గానూ, అసోసియేట్ గానూ పనిచేసిన బి.ఎస్.నారాయణ 1960 తర్వాత తానే స్వీయదర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం ఆరంభించారు.శ్రీదేవి, పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి చిత్రాలు నిర్మించిన ఆయనే [...]
పూర్తిగా చదవండి

Making Movies:వ్యాసం 4 – ఒంటెలు-ట్రెయిన్లు

Telugu సౌమ్య
Disclaimer: The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly [...]
పూర్తిగా చదవండి

Cinema is Truth 24fps

Telugu శిద్దారెడ్డి వెంకట్
హంగరీ దేశానికి చెందిన Bela Tarr తన సినిమాల్లో ఎక్కువ నిడివి గల షాట్లు ఉపయోగించి ప్రేక్షకులకు బోరు కొట్టిస్తాడని ఒక అపవాదు వుంది. కానీ నా దృష్టిలో అది కేవలం అపవాదు మాత్రమే. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఒక సీను long shot లో చిత్రీకరించ వచ్చు, లేదా closeup లో చిత్రీకరించవచ్చు. అలాగే ఒక షాట్ long take లో తీయవచ్చు లేదా వివిధ కోణాల్లో, వివిధ పాత్రల points of [...]
పూర్తిగా చదవండి

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) – ఒక సామాజిక విశ్లేషణ

Telugu K మహేశ్ కుమార్
రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది [...]
పూర్తిగా చదవండి

బెలా టర్ – ఒక పరిచయం

Telugu శిద్దారెడ్డి వెంకట్
హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు. 1955లో హంగరీ దేశంలో జన్మించిన Bela [...]
పూర్తిగా చదవండి

జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

Telugu పొద్దు
- వీవెన్, చదువరి 2008 జూన్ -తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు చవిచూసిన నెల -ఆంధ్రజ్యోతి, మంద కృష్ణ మాదిగల మధ్య తారాస్థాయి యుద్ధం - పర్యవసానంగా పాత్రికేయులను పోలీసులు నిర్బంధించిన నెల -దేవేందర్ గౌడ్ తెదేపా నుండి బయటికి వచ్చిన నెల -పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు తారాజువ్వల్లాగా ఎగసిన నెల. వెరసి టపాలకు మంచి విషయాలు దొరికిన నెల. బ్లాగుల్లో సాధారణంగా స్వగతాలో, జ్ఞాపకాల నెమరువేతలో, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల గురించో, సినిమాల గురించో చర్చలుంటాయి, అభిప్రాయాలూంటూంటాయి. [...]
పూర్తిగా చదవండి

ఈ సంవత్సరం మీ దృష్టిలో హిట్టయిన తెలుగు సినిమాలు..

Telugu tiyyanitenugu
ఈ సంవత్సరం మీ దృష్టిలో హిట్టయిన తెలుగు  సినిమాలు.. ౧.     ……………………. ౨.     ……………………. ౩.     ……………………. ౪.     ……………………. ౫.     ……………………. ౬.     ……………………. ౭.     ……………………. ౮.     ……………………. ౯.     ……………………. ౧౦.   …………………….
పూర్తిగా చదవండి

‘పరుగు’ – ఒక సామాజిక విశ్లేషణ

పరుగు, పెళ్ళి, ప్రేమ, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
ఇప్పటివరకూ ‘పరుగు’ సినిమా సమీక్షలు చాలానే చదవటం జరిగింది. కానీ ఇప్పుడే నేను సినిమా చూశా! నేను చదివిన సమీక్షలలో, “బొమ్మరిల్లు అంత బాగాలేదు” అనే తులనాత్మక జడ్జిమెంటో, లేక “పరుగు సినిమా స్పీడ్ తగ్గింది” అని సినిమా నడిపిన వేగం గురించో, మహా ఐతే “ఇది చిరంజీవి కూతిరి కథలా ఉంది” అనో సింపుల్గా తేల్చెయ్యడం జరిగింది. కానీ చూసిన వెంఠనే నా కనిపించిన మొదటి భావం “హమ్మయ్య మనుషులగురించి ఒక కమర్షియల్ హీరో సినిమా [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా బాగుపడాలనీ !

తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
“తెలుగు సినిమా చెడిపోయిందహే!” అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి “దీన్నుంచైనా నెర్చుకోరు” అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి ”కూసింత అంతర్మధనం అవసరమోయ్” అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా… కొంచం అమృతం, మరింత [...]
పూర్తిగా చదవండి

“భారతీయ సినిమాల్లో స్త్రీ” – ఒక మంచి పుస్తకం ఇక్కడ చదువుకోండి

Telugu Vamsi M Maganti

పూర్తిగా చదవండి

బ్లాగుతా తీయగా చల్లగా

Telugu క్రాంతి
అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్లాగులు బర బర,చిర బర బ్లాగేయాలని ఉంటుంది నాకు.కాని ఎలా? నేను ఏమో బోలెడన్ని కష్టాల్లో ఉన్నాను.అదేంటో అన్ని కష్టాలు నాకే,అదీ ఒకేసారి వచ్చిపడతాయి.నాకు వచ్చిన అతి పెద్ద కష్టమేంటంటే,నాకు ఈ మధ్యే పెళ్ళయ్యింది.పెళ్ళి తరవాత మా అమ్మ,అత్తయ్య విడి విడిగా,జాయింట్ గా కలిపి మొక్కిన మొక్కుబడులన్ని తీర్చడానికి మేము దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని తిరిగాము.ఇంకా పక్క రాష్ట్రాల్లోవి కొన్ని మిగిలి ఉన్నాయి.నాకు పెళ్ళయ్యాక ఒక పెద్ద నిజం తెలిసింది.పెళ్ళంటే సినిమాల్లో చూపించినంత కలర్ ఫుల్ గా ఏమి ఉండదు.ముఖ్యంగా అమ్మాయిలకి అయితే మరీ!నన్నే చూడండి,పెళ్ళికి ముందు మహారాణి లాగ ఉండేదాన్ని.మరి ఇప్పుడో,ఇల్లు నేనే సర్దాలి,వంట నేనే సర్దాలి.నచ్చినా,నచ్చకపోయినా అందరు వేసే సొల్లు జోకులకి నవ్వాలి.అబ్బ సోది లైఫ్!!పైగా నాకు,మా ఆయనకి ఒక్క విషయంలో ఏకాభిప్రాయం కుదరదు.కాబట్టి సమాన హక్కుల కోసం జరిగే పోరాటలతోనే సరిపోతుంది.ఇది చాలదన్నట్టు సిటీ మధ్యలో ఉన్నమా ఆఫీస్ ని ఊరు అవతల ఉన్న వైట్ ఫీల్డ్ కి మార్చారు.మా సెంటర్ డైరెక్టర్ హాయిగా ...
పూర్తిగా చదవండి

Kantri Ante NTR anI

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
పూర్తిగా చదవండి

కంత్రి సమీక్ష

Kantri, NTR Jr, ఎంటీఆర్ జూనియర్, కంత్రి, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఈ సమీక్షలో వ్యక్తపరచబడ్డవి రచయిత అభిప్రాయములగా భావించగలరు. ఇతర రచయితలు ఇదే సినిమా గురించి వేరే విధంగా భావించవచ్చని గమనించగలరు. పేరుకు తగ్గట్లుగానే (kaNTRi) ఈ చిత్రంలో జూనియర్ యన్.టి.అర్. గురించి తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఎమీ లేదు. ఈ చిత్ర మొదటి భాగం పోకిరి చిత్రాన్ని మరియు రెండవ భాగంలో కొంత శాతం మున్నా చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. కాని ఈ చిత్రం తారక్ మునుపటి చిత్రం యమదొంగ స్థాయిని చేరలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో ఒక [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS