Can't see Telugu? Learn here. More Questions? Ask here.

వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు - మొదటి భాగం

Making Movies, articles of Satyajit Ray, చలన చిత్ర నిర్మాణం, బెంగాళి సినిమా, భారతీయ సినిమా, రే వ్యాసాలు, సత్యజిత్ రే సౌమ్య
పథేర్ పాంచాలీ సినిమా తీయడానికి దాదాపు రెండున్నరేళ్ళు పట్టింది. అంటే, ఆ సమయంలో ప్రతీరోజూ షూటింగ్ చేసామని కాదనుకోండి. అప్పట్లో నేనొక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లో పనిచేసేవాణ్ణి. నాకు సెలవుల్లోనే షూటింగ్ వీలుపడేది లేదంటే పని వేళల్లోనే కాస్త సమయం తీసుకోవాల్సి వచ్చేది. పైగా, మా వద్ద అంత డబ్బుకూడా ఉండేది కాదు. ఉన్న కాస్తా అయిపోతే, మళ్ళీ డబ్బులు పోగయ్యేదాకా ఎదురుచూడ్డం తప్ప ఇంకేమీ చేయగలిగేవాళ్ళం కాము. అసలు షూటింగ్ మొదలయ్యేముందు అన్నింటికన్నా కష్టమైన పని [...]
పూర్తిగా చదవండి

పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం

satyajit ray, short film, పీకు, పీకూ, ప్రత్యేకం, లఘ చిత్రం, వీడియో, సత్యజిత్ రే శిద్దారెడ్డి వెంకట్
సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన [...]
పూర్తిగా చదవండి

పరుగు సమీక్ష

Allu Arjun, Bommarillu Bhaskar, parugu review, అల్లు అర్జున్, పరుగు సమీక్ష, బొమ్మరిల్లు భాస్కర్, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరుగు సినిమా వారిని థియటర్ వైపు పరుగులు తీయించకపోయినా, థియేటర్లో కూర్చోబెట్టగలుగుతుంది. బొమ్మరిల్లు తరవాత భాస్కర్ దర్శకత్వంలో దరిదాపు రెండేళ్ల తరువాత వచ్చిన సినిమా అవ్వడం చేత ప్రేక్షకులు ఈ సినిమా నుండి చాలా ఆశించారు, కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందనే అనాలి. కానీ దిల్ రాజు మునుపటి చిత్రం మున్నాతో పోలిస్తే ఈ సినిమా బాగుంది. అలాగే అల్లు అర్జున్ మునుపటి సినిమా దేశముదురు స్థాయికి ఈ [...]
పూర్తిగా చదవండి

ఒంటరి గృహిణి - “చారులత”, సత్యజిత్ రాయ్ సినిమా

bengali cinema, bengali films, charulata, satyajit ray, చారులత, బెంగాలీ సినిమాలు, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే విష్ణుభొట్ల లక్ష్మన్న
(భారతీయ సినిమాలోనే కాక, ప్రపంచ సినిమాలో అగ్రశ్రేణి దర్శకుల్లో ప్రత్యేక స్థానం బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ది. రాయ్ దాదాపు 26 సినిమాలు, 10 డాక్యుమెంటరీలకి దర్శకత్వం చెయ్యటమే కాక మరెన్నో సినిమాలకి తన సహాయం అందించాడు. ఆయన తీసిన సినిమాలు కొన్ని నవతరంగం పాఠకులకు పరిచయం చేద్దామని నా ప్రయత్నం. ఈ శీర్షిక కింద, “చారులత” సినిమా ముందు పరిచయం చేస్తున్నా.) ప్రపంచ సినిమాలో అతి ప్రముఖుడైన బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ [...]
పూర్తిగా చదవండి

మేకింగ్ మూవీస్ - సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా

ప్రకటన, ప్రత్యేకం సౌమ్య
“Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని సరళత్వం నాకు చాలా నచ్చింది. అవి తెలుగులోకి అనువదించి మన భాషలో మనవాళ్ళు చదువుకునే సౌలభ్యం ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇదే విషయం వెంకట్ గారితో మాట్లాడుతూ(చాట్లాడుతూ) ఉండగా, నేనే అనువాదం చేస్తానన్నాను. [...]
పూర్తిగా చదవండి

సత్యజిత్ రే-ఒక పరిచయం

bengali cinema, focus, satyajit ray, ప్రముఖులు, బెంగాలీ సినిమా, భారతీయ సినిమా, సత్యజిత్ రే వారాల ఆనంద్
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు [...]
పూర్తిగా చదవండి

నవతరంగానికి నాలుగు నెలలు

ప్రకటన, ప్రత్యేకం రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నూతనసంవత్సర శుభారంభ వేళ,మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ అంతర్జాలంలో ఎగిసిన కెరటం నవతరంగం,పాలపొంగులా, అలా.. అలలా ఆరంభశూరత్వమే కాక కాలక్రమంలో అర్ధవంతమైన సమాచారనిలయం గా మారింది.గడచిన నాలుగు నెలలలో వందలవ్యాసాలూ,విశ్లేషణలూ,వ్యాఖ్యానాలతో చలనచిత్రప్రియులను అశేషంగా ఆకట్టుకుంటుంది నవతరంగం. జల్సా, గోదావరి లొ గూఫులు,మై డిన్నర్ విత్ ఆంద్రె ,తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!, నిండు మనిషి -శోభన్,Travellers and Magicians – భూటాన్, తెలుగు సినిమా పరిస్థితి [...]
పూర్తిగా చదవండి

Cannes-2008

Cannes 2008, Film festival information, cannes, cannes film festival, కేన్స్ 2008, చలనచిత్రోత్సవం, చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ ఫెస్టివల్ శిద్దారెడ్డి వెంకట్
వచ్చే నెల 14 నుంచి 25 వరకూ ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా ఈ రోజు విడుదలయింది. స్టీవెన్ స్పీల్‍బర్గ్, వుడీ ఆలెన్, స్టీవెన్ సోడర్‍బెర్గ్,క్లింట్ ఈస్ట్ వుడ్ లాంటి హాలీవుడ్ దర్శకుల చిత్రాలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చే ఎన్నో ఉత్తమ చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శితం కానున్నాయి. అలాగే వాంగ్ కర్ వాయ్,డేవిడ్ లించ్ రూపొందించిన చిత్రాలు కూడా ఈ చలనచిత్రోత్సవంలో అలరించనున్నాయి. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్న సినిమాలకై ఈ క్రింది లిస్టు [...]
పూర్తిగా చదవండి

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

ప్రముఖులు, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని  విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది.  అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి [...]
పూర్తిగా చదవండి

గరం-గరం

చర్చ, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ చర్చ [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా K మహేశ్ కుమార్
“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం [...]
పూర్తిగా చదవండి

పెద్దలు - ప్రేమలు - సినిమాలు

చిత్రం, పెద్దలు, ప్రేమలు, భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమాలు K మహేశ్ కుమార్
“దేవదాసు” కు దాస్యం చేసి, “మల్లీశ్వరి” ని రాణి ని చేసి, “సాహసం సేయరా ఢింభకా…రాకుమారి దక్కుతుందని” (పాతాలభైరవి) ప్రేమని ప్రోత్సహించిన తాతయ్య,బామ్మ ల తరం ఒకటైతే, “మేఘసందేశా”న్ని మధించి “ప్రేమాభిషేకా”న్ని పొంగించిన నాన్నలు,అమ్మల తరం మరోటి. కానీ,ఈ రెండు జనరేషన్లూ ప్రేమకు వ్యతిరెకమే.మళ్ళీ ఏమైనా ఆంటే “ఈకాలం సినిమాలున్నాయి చూసారూ…ఇవి పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి” అంటూ రాగాలు పోవడం పరిపాటి. నిజంగా సినిమాలు అంత మహత్తును కల్గి ఉంటాయా? మానవ సంభంధాలను అదీ ముఖ్యంగా ప్రేమను నిర్వచించి,ప్రోత్సహించే [...]
పూర్తిగా చదవండి

Dersu Uzala (1975)

Akira Kurosawa, Dersu Uzala, japanese films, ఆకిరా కురోసవా, జపనీస్ సినిమా, డెర్సు ఉజాలా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“Dersu Uzala” - మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా తీసారు. [...]
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, satyajit ray, చారులత, ప్రముఖులు, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

తోడికోడళ్ళు

aadurti subbarao, dukkipati madhusudhan rao, అతిధి వ్యాసాలు, ఆదుర్తి సుబ్బారావు, తోడి కోడళ్ళు, దుక్కిపాటి మధుసూదన , భారతీయ సినిమా, సమీక్ష అతిధి
ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ. అన్నపూర్ణ (కన్నాంబ) , అనసూయ (సూర్యకాంతం ), సుశీల (సావిత్రి). పెద్ద కోడలు అన్నపూర్ణ మాట కటువైనా మనసు మాత్రం నవనీతం లాంటిది. ఆమె భర్త కుటుంబరావు (ఎస్.వి.రంగారావు) మంచి పేరున్న వకీలు. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోడు. పైగా ఇంటివిషయాలంటే మతిమరుపు కూడా. రెండో కోడలు అనసూయ అసూయాపరురాలు. ఆమె భర్త రమణయ్య ( రేలంగి) పేకాట రాయుడు, కులాసాగా తిరగడం,ఎప్పుడూ డబ్బు తగలేయడమే . మూడో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS