Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు బ్లాగులు :: వాటి కాప్షన్

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
నేను ఇంతకు ముందు ప్రచురించిన టపా గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్...
పూర్తిగా చదవండి

పుస్తక పఠనం – 2007

సాహిత్యం... ఫణీంద్ర
హిందూ లిటరరీ సప్లిమెంట్ చూసాక ఈ ఆలోచన తట్టింది. ప్రముఖులు ఈ సంవత్సరం తాము చదివిన పుస్తకాల్ని ...
పూర్తిగా చదవండి

భ్రమలు వీడే క్రమం

రచనాభ్యాసాలు ఫణీంద్ర
My life, as I see it, won’t get any validation from this world. What shall I do then: transgress this triviality and go on living as I see it; or, distrusting my own instincts, shall I submit myself to this world? (Dairy ’86—87) * * * "ఏవై...
పూర్తిగా చదవండి

మన బ్లాగు ఎంత తాజాగా ఉంది?

ప్రకటన, స్వగతం gsnaveen
1. నా బ్లాగు ఎంత తాజాగా ఉంది? తెల్లవారి…అప్పుడే కూరగాయల విపణిలో (Market) నవ నవ లాడుతున్న కూరగాయల్లా తాజాగా ఉంటుందా లేక అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే కుళ్ళు కంపు కొడుతుందా?2. నేను ఉపయోగపడే టపా వ్రాస్తానా లేక ఎవ్వరికీ ఉపయోగపడని బేవార్స్ టపా వ్రాశానా?3. నేను వ్రాసిన టపా జనాలకు ఎంత నచ్చింది?4. నేను వ్రాసిన టపాల్లో అత్యుత్తమ టపా ఏది?5. ఈ సంవత్సరంలో వ్రాసిన అత్యుత్తమ టపాలు ఓ పది పట్టడమెలాగు?6. ఉండడానికే!!! [...]
పూర్తిగా చదవండి

నేటి స్త్రీ తేజం - నా ఆలోచనలు

స్వగతం lalithag
మౌని గారు రాసిన “నేటి స్త్రీ తేజం” నన్ను ఆలోచింప చేసింది. బొట్టు, పరికిణీలు, చీర, పువ్వులు, గాజులు, గజ్జెలు - అందం, శ్రావ్యం, సుగంధ భరితం…. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో మధురమైన ఊహలు, అందమైన బొమ్మలు…. ఆనందాలకి చిహ్నాలు. సంస్కృతి చిహ్నాలా? మరుగై పోతున్నాయా? మరుగున పడి పోతున్నాయా?  భాష, సంస్కృతి, విలువలు వంటి వాటిని గురించి మాట్లాడేటప్పుడు మన చుట్టు పక్కల చూసినది కొంత, generalisation చాలా ఎక్కువ ఉంటుందని నాకనిపిస్తుంది. సంస్కృతి అంటే ఉట్టి వేష భాషలే కాదు. అందునా [...]
పూర్తిగా చదవండి

Father’s Day అభినందనలు

స్వగతం lalithag
తండ్రులు తాతలు పెద్దలు, బాధ్యతకు తాము మారు పేరులు పేరుతో పాటు ప్రేమను పంచుతారు పేరు పెంచేలా పిల్లలను తీర్చిదిద్దుతారు అభినందనలు తండ్రులకి ప్రత్యేకించి ఈ రోజు అమ్మతో పాటు నాన్నకీ అభివందనం ప్రతి రోజూ
పూర్తిగా చదవండి

ఆత్మ విశ్వాసం

స్వగతం lalithag
రావు గారు నా యాభయ్యవ టపాకి వ్రాసిన వ్యాఖ్యలో ఇలా అన్నారు, “ఈ పయనంలో కొన్ని గిరిశిఖరాలను స్పృశిస్తాము.” ఆ మాటలు నన్ను ఆలోచింప చేసాయి. నన్ను వెంటాడే ఇంకొన్ని ఆలోచనలను గుర్తు చేశాయి. వాటన్నిటినీ కలిపి రాసుకునే ప్రయత్నం ఇది. జీవితం అనేది కొన్ని మధురమైన జ్ఞాపకాల సముదాయం. విజయం అనేది కొన్ని achievements సముదాయం. ఏ ఒక్క విజయమూ ఆఖరు కాదు. ఏ ఒక్క ఓటమీ, అంతం కాదు. జీవితం నిరంతర ప్రయాణం. నిరంతర ప్రయాస. ఈ ప్రయాణంలో కొన్ని గిరి [...]
పూర్తిగా చదవండి

బాధ

స్వగతం lalithag
గతమెంతో గందరగోళం ఘనమగు ఒక పోరాటం అమృతం కోసం ఆరాటంలో అందిన గరళం కొందరి స్వంతం
పూర్తిగా చదవండి

సమాచారం, సంచలనం

స్వగతం lalithag
Readers Digest లో చదివాను ఈ జోకు. ఒక తల్లి తన స్నేహితురాలితో వారు వెళ్ళి వచ్చిన vacation గురించి చెపుతుంటుంది. అప్పుడు ఆమె కూతురు ఇలా అంటుంది, “Mom, that sounds more fun than our vacation!”    అంటే, పాపం ఆ తల్లి ఉత్సాహం కొద్దీ ఎక్కువ చేసి చెప్పే సరికి ఆమే కూతురే, విషయమే మారిపోయిందనుకుంది. సమాచారం విలువైనదే. ఒక్కో సారి కొన్ని విషయాలు పెద్దవి చేసి చెప్పాల్సి వస్తుంది, దాని ప్రాముఖ్యతను దృష్టిలోకి తెచ్చేందుకు. అయితే అలా ప్రాముఖ్యత [...]
పూర్తిగా చదవండి

సీతాకోకచిలుకలు కావాలి అంటే గొంగళి పురుగులను అసహ్యించుకోకూడదు!

స్వగతం lalithag
పిల్లలు మాటలు నేర్చుకుంటుంటే సరదాగా ఉంటుంది. బోసి నవ్వులు మురిపించినా, ముద్దు మాటలు ముచ్చటేసినా, వారు వారి భావాలను ప్రకటించగలిగే మాటలు నేర్చినప్పుడు మాత్రం ఆనందం కలగడమే కాకుండా “హమ్మయ్య” అని కూడా అనిపిస్తుంది. వాళ్ళకు కలిగే భావాలను ప్రకటించడానికి ప్రోత్సాహం ఇస్తాము. vocabulary పెరుగుతున్న కొద్దీ సంతోషిస్తాము.  కథలు చెప్తుంటే పొంగిపోతాము. ఇంతలోనే ఇంకో పెద్ద బాధ్యత నెత్తి మీద పడుతుంది. వారికి హద్దులు నేర్పడం. అంతే కాదు వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడం. మా పెద్దబ్బాయి [...]
పూర్తిగా చదవండి

ఇలా అనిపిస్తోంది

స్వగతం lalithag
ప్రార్థనకి బలముంది ఆ దేవత దయ ఉంది తలచినందుకు ఆ తల్లి పలుకులతో పలకరిస్తోంది
పూర్తిగా చదవండి

తెలియ రాదా నాకు తెలుగే రాదా

స్వగతం lalithag
తెలియ రాదా? నాకు తెలుగే రాదా? తెలివైన వారు, తెలిసిన వారు తెలుసుకుంటున్నారు మర్మములను నేనేరుగలేనైతినే! అవి నే నొప్పలేనైతినే!  భాష ఏమో భావమేమొ ఆవేశమేమో ఆలోచనేమో నిజమేమో నిరూపణలేమొ ఏమో ఏమి ఈ అయోమయమో వేదమే అది యౌనో కావ్యమే మరి ఏమో మాటలేమో అనుకుంటి మూఢురాల నేనైతి భాషనే నేర్వ వలెనో  నే మరల బడికే పోవలెనో ఓనమాలు నేర్వ వలెనో నేను మరి ఒంటరినేలైతినో ఒంటి బ్రాహ్మణుండొకనాడు వెంట మేక పిల్ల గొనిబోవ వెంటబడి నలుగురది కుక్కపిల్లంటిరే, కాని వారు దొంగ వారైతిరే స్తంభమన్నారు ఒకరు, కాదు పాము అన్నారు కానలేక కాలు, తొండము తడిమి చూసిన వారు ఏనుగని వారు దానిని ఎరుగకుండుట [...]
పూర్తిగా చదవండి

బ్లాగావేశాలు

స్వగతం lalithag
రాయాలని ఉంది ఎంతో చెప్పాలని ఉంది ఆలోచనలు పంచుకోవాలని ఉంది అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది మార్గం అన్వేషించాలని ఉంది మార్పును ఆహ్వానించాలని ఉంది ఆత్మావలోకనం చేసుకోవాలనుంది అభ్యంతరాలను తెలపాలని ఉంది మాట నేర్చిన మనిషి మనసుకిన్ని మెలికలెందుకో రాయ నేర్చిన వారికి చదివి ఎరుగుట కష్టమెందుకో నచ్చిన మాట నెత్తికెత్తుకుని నచ్చనివన్నీ తప్పులందురు మాట మాటకు బదులు చెప్పినా ముందు మాటను విడువకుందురు పేరు చెప్పక పరువు తీస్తే స్వేచ్ఛ అని సమర్థింతురు పేరు చెప్పి ప్రశ్నిస్తే అవమానమని ఆక్షేపింతురు ఏమి చెప్ప వలె ఇక ఏమి రాయ వలె చెప్పినది ఒకటైతే చెప్పుకునేది ఇంకొకటి ఆశలన్నీ ఇంతేనా ఆశయాలిక అడుగంటెనా?  
పూర్తిగా చదవండి

చిన్ననాటి జ్ఞాపకాలు - 1

స్వగతం lalithag
ఇప్పుడు మా పిల్లలకు చదువు నేర్పుతుంటే నేను చిన్నప్పుడు చదువు నేర్చుకున్న విధానం గుర్తుకు వస్తుంటుంది అప్పుడప్పుడు.   అక్షరాలు నేర్చుకున్నది మా అమ్మమ్మ దగ్గర. ఒక అక్షర మాల పట్టిక నాకు కొనివ్వడం బాగా గుర్తుంది నాకు. దాని మీద వేలుతో అక్షరాలు దిద్దుతూ, మధ్యలో తప్పయ్యిందని ఆ ఊహా అక్షరాన్నే చెరిపేసి మళ్ళీ దిద్దిన విషయం, అది చూసి మా మామయ్యలు నన్ను ఏడిపించడం గుర్తుకు వస్తూ ఉంటుంది. పలక మీద అక్షరాలు దిద్దటం గుర్తుంది. అంతకు [...]
పూర్తిగా చదవండి

ఆడ వాళ్ళూ, స్వేచ్ఛ

స్వగతం lalithag
ఒక గమనిక: ప్రస్తుత చర్చ మధ్య తరగతి కుటుంబాల స్త్రీల “స్వేచ్ఛ” గురించి. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేదీ, పుచ్చుకునేదీ కాదు. స్వంత ఇష్టం. ప్రతి ఒక్కరికీ వారి స్వంత ఇష్టం ఉంటుంది. ఆ స్వంత ఇష్టం ప్రకారం నడుచుకో గలిగే హక్కూ, దానిని సక్రమంగా వాడుకునే బాధ్యతా ఉంటాయి. సరే, తమ ఇష్టానుసారం బాధ్యతనెరిగి చేసే పనులకు అనుమతి తీసుకోనవసరం లేని  స్వాతంత్ర్యం ఎంతమంది ఆడ వాళ్ళకు ఉంటుంది? ముందు పిల్లల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. పిల్లల అభిప్రాయాన్ని వినిపించుకోవడం, కొన్ని విషయాలలో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS