Apr 29
ఎందుకిలా?
స్వగతం lalithag
కన్నీరు కార్చ గలరు
కబుర్లు చెప్పగలరు
కలలు నిజం చెయ్యగలరు
కలిమి కూర్చగలరు
కల్పనకందని భావాలను
కవితలలోని మర్మాలను
తలదన్నే తలపులను
తమలోనే కలిగుంటారు
కొమ్మలు, అయ్యలారా!
మీ మనసులు దోచుకుంటారు
మాటలు నేర్పిస్తారు
కావ్యాలను ప్రేరేపిస్తారు
చేయి పట్టి
పేరు మార్చి
కల నిజమయ్యాక
కలల్లోనే ఉంటున్నావంటారు
కవితలు అల్లుతారు
కథలు రాస్తారు
రచయితలు ఎక్కువగా
మగవాళ్ళే ఉంటారు
మగవాళ్ళూ,
మగువల మనసులనేలే మహరాజులూ
మాటలు దోచుకుంటారు
మౌనంగా ఉంటే మర్మమేదో ఉందంటారు
మెచ్చుకోలు మచ్చుకుండదు
తప్పులేవీ తప్పిపోవు
అండ మీరంటే అందలం ఎక్కుతారు
అందుకోమంటే “అందుకే అబలలు” అంటారు
చేయందిస్తామంటే చిన్నబుచ్చుకుంటారు
చెప్పకుండా చేస్తుంటే చెయ్యకేం చేస్తారంటారు
మగవారూ, మీరు ఎందుకిలా చేస్తారు
మగువలని మీరు మనుషులని ఎప్పుడంటారు?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి