Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కళాపోషణ

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
నిన్న లండన్ లో ఒక కళా ప్రదర్శన జరుగుతుంటే ‘G’ ఆహ్వానం పంపింది. కాదనకుండా వెళ్ళాను. షుమారు 40 మంది కళాకారులు తమ తమ వర్ణ చిత్రాలను, శిల్పాలను, చాయా చిత్రాలను అక్కడ ప్రదర్శించారు. సమకాలీన కళ పేరుతో వియుక్త భావాలు కలిగిన చిత్రాలతో ప్రదర్శన సగానికి పైగా నిండి పోయింది. ఒక్కో సారి కళాకారుడికే తప్ప చూసే వాళ్ళకు అర్థం కావనిపిస్తాయి కొన్ని చిత్రాలు. అలాంటప్పుడు ఆ చిత్రకారుని అడిగి తెలుసుకుంటే ఎంతో బావుందనిపిస్తుంది. [...]
పూర్తిగా చదవండి

Lin Osborn

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ప్రతి రోజు మనం చూసే పక్షులు, ఫలాలు, కూరగాయలు,తలుపులు, కిటికీలు, లాంటి సాధారణ అంశాలను ఛాయాచిత్రాల రూపంలో చిత్రీకరించి ఒక దాని తర్వాత ఒకటిగా అమర్చడం ద్వారా ఒక కొత్త అందాన్ని, అనుభూతిని ప్రేక్షకులకు అందివ్వడంలో నూటికి నూరుపాళ్ళు సఫలం కాగలిగిన Lin Osborn తన కళ గురించి వివరిస్తూ ఇలా అన్నారు. “In the single colour works I combine the mundane and the sublime to create intriguing [...]
పూర్తిగా చదవండి

Tim Sennitt

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఎక్కువగా తైల వర్ణ చిత్రాలతో నిండిపోయిన ప్రదర్శనలో అక్కడక్కడా కొంతమంది తాము తీసిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించారు. వారిలో Tim Sennitt ఒకరు. ఈయన తీసిన ఫోటోలు చూడగానే “ఆ ఇందులో ఏముంది. మనక్కూడా ఒక ఫొటో ఇచ్చి, రెండుగంట సేపు కంప్యూటర్ లో Adobe Photoshop తో కుస్తీ పడితే మనమూ ఇంతకంతే మంచి బొమ్మలే ఇత్పాదించవచ్చు” అని చాలా మందికి (నాకులాగే) అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తాం. Tim Sennitt ఛాయాచిత్రాలు [...]
పూర్తిగా చదవండి

Karen Griffiths

art, general, opinion, తెలుగులో... venkat.siddareddy
France నుంచి వచ్చిన Karen Griffith అనే చిత్రకారిణి, తన చిత్రాలన్నింటిలోను చిన్న పిల్లలనే అంశంగా ఆధారంచేసుకుని అద్భుతమైన కళాఖండాలను సృష్టించింది. ఈ చిత్రాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే, చిత్రాల్లోని పిల్లలందరూ ఆసియా దేశాలకు చెందినవారే. “ఈ చిత్రాలు గీయడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది?” అన్న నా ప్రశ్నకు “మీ దేశానికి నేను చాలా ప్రయాణం చేశాను. అక్కడ చూసిన దృశ్యాలే నాకు ప్రేరణ.” అన్న సమాధానం నాకు సంతోషం కలిగించింది. అంతే కాదు, “ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

Kirsty McLaren

art, general, opinion venkat.siddareddy
మనందరం ఛాయాచిత్రాలు తీస్తూనేవుంటాం. కాని Kirsty McLaren అనే ఆవిడ తను తీసిన ఛాయాచిత్రాలకు విశిష్ట పధ్ధతులనుసరించి రంగులద్ది కొత్త  అందాలను సృష్టించింది. మన తాజ్ మహల్ ను కూడా ఈ విధంగానే తన కెమెరాలో బంధించి తిరిగి రంగులద్ది, వెన్నెలలో వింత కాంతులతో మెరిసిపోయేలా చేసిన ఈమె ప్రతిభ నాకు చాల నచ్చింది. ఆ చిత్రాన్ని మీక్కూడా చూపించాలని ఉన్నా సరైన సమయానికి నా చేతిలో కెమెరా లేకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. Kirsty McLaren [...]
పూర్తిగా చదవండి

Agata S Hamilton

art, general, opinion venkat.siddareddy
నిన్న చూసిన కళాఖండాలలో Agata S Hamilton చిత్రించిన చాయాచిత్రాలు, వర్ణచిత్రాలు నాకు నచ్చిన వాటిలో కొన్ని. ఆమె చిత్రాల గురించి ఆవిడ ఇలా చెప్తుంది, “I deal with existential emotions and states of mind. My work is about human drama and human dilemma. It speaks of anxiety, emotional chaos and fear. It is about the tortured psychological state and isolation, [...]
పూర్తిగా చదవండి

చెన్నై కబుర్లు

general pmkrishna79
నేను చెన్నై నిరుడు నవంబర్ లో వచ్చాను. చెన్నై నాకు కొత్తేమీ కాదు. చదివింది ఇక్కడే. కానీ మళ్ళీ ఇక్కడికి వస్తానని అనుకోలేదు. చదువుకొనే రోజుల్లో సినిమాలు బాగాచూసేవాడిని. తమిళ్ సినిమాలలో నాకు ఎక్కువ ఓవర్ యాక్షన్ కనపడుతుంది. ఇప్పుడు అలవాటైంది. ఇక్కడ ముఖ్యంగా జనాలకి భక్తి ఎక్కువ. అని నాకే అనిపిస్తుందేమో. గుడి కనపడితే చాలు చంపలు కొట్టుకుంటారు, గుంజిళ్ళు తీస్తారు. మొహమంతా పసుపు పూసుకొని, పసుపుపచ్చ చీరకట్టుకొని, మంత్రాలు చదులుకొంటూ గుడిచుట్టూ తిరిగే ఆడవారిని చూస్తే భలే [...]
పూర్తిగా చదవండి

అమ్మా!

general జ్యోతి
 మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ సన్నజాజుల వింజామరలూపి ఎంచక్కని పూతేనెల విందులిచ్చి నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు? ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి మమతల మురిపాల లోగిలికి… తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని నీ చిన్నారి బొజ్జ నింపే ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి. ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె? అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది. చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది. ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది. నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది. నీకోసం ప్రాణాలిస్తుంది. ఆమె పూలజోలల లాలనలో, ఒడిన ఊగు వూయలలో  నీకు ఈ [...]
పూర్తిగా చదవండి

మీరు చూడని సినిమా

general, opinion, తెలుగులో... venkat.siddareddy
ఈ రోజు www.MSN.co.uk  లో  16 Great Films You’ve Never Heard Of అని ఒక శీర్షికలో ప్రచిరించిన పదహారు సినిమాలు ఇవే: 1)In the Company of Men 2)Nine Queens 3)Rosemary’s baby 4)Pink Flamingos 5)The straight story
పూర్తిగా చదవండి

Creativity, best of

general, opinion, poetry, తెలుగులో... venkat.siddareddy
మన జీవితంలో మనమెన్నో కథలు, కథానికలు, పద్యాలు, కవితలు, పాటలు పుస్తకాలు చదువుతుంటాము. కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కాని నచ్చిన వాటిల్లో కొన్ని చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్ని చదివి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కూడా; బాధతో కాదు సుమా! గుండెలనావరించిన ఆనందం అక్కడ పట్టలేక ఆనందభాష్పాలుగా కనుకొనలనుండి మెల్లగా జారి తిరిగి హృదయాన్ని చేరుతాయి.
పూర్తిగా చదవండి

This is for all Telugu lovers..

general జ్యోతి
Blogging in Telugu The number of Telugu blogs has been increasing day by day. Especially, there is a phenomenal growth in the last six months. There seems to be more than a thousand Telugu blogs, with around 250 being regularly updated. The topics covered by Telugu blogs range from comics to cinema, politics to poetry, media to [...]
పూర్తిగా చదవండి

అమితాబ్ – చినీ కం

general, opinion, తెలుగులో... venkat.siddareddy
అమితాబ్ బచ్చన్ మంచి నటుడే! కాని రోజు రోజుకి అతని ప్రభావం సినిమాలపై ఎక్కువైపోతుందని నా అభిప్రాయం.అవసరమున్నా లేకపోయినా అతన్ని ఎలాగోలా తమ సినిమాల్లో ఇరికించేసి మా సినిమాలోను బచ్చన్ ఉన్నాడంటూ సినిమాలనమ్ముకోవడం పరిపాటయిపోయింది. పోనీలే చిన్న పాత్రలే కదా ఎలాగో భరించేద్దమనుకుంటె ఈ మధ్య మన్ రాం గోపల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా మరొక ట్రెండ్ మొదలయినట్టు అనుమానం కలుగుతుంది. అరవై ఏళ్లు పైబడ్డ ముదుసలి ఇరవై ఏళ్ళైన నిండని కన్నెపిల్ల తో ప్రెమలో [...]
పూర్తిగా చదవండి

Two poems

general, poetry venkat.siddareddy
Worries, whims and all! Worries, whims and all! She leaned over the window of the bus. After a while she was fast asleep And turned the other side. Whims, worries and a drop of sleep, Rolled onto her neighbour’s shoulder. After nearly twenty minutes she woke up And realised she had missed her stop. [...]
పూర్తిగా చదవండి

తరువాయి భాగం

filmreviews, general, తెలుగులో... venkat.siddareddy
తెలుగు సినిమా చరిత్రలోని రికార్డులన్ని తిరిగిరాసిన పోకిరి చిత్రానికి రెండో భాగం తీస్తారని ప్రకటించి పూరి జగన్నాధ సంచలనం సృష్టించారు.మన తెలుగు సినిమాల్లో సీక్వేల్స్ తీయడంలో కొత్త కాకపోయినప్పటికి, హిట్టయిన సినిమాకు రెండో భాగం నిర్మించి success సాధించిన సినిమాలేవి లేవనే చెప్పాలి. కాని Hollywood లో ఏనాటి నుంచో సీక్వేల్స్ తీయడమనేది మరో successful సూత్రం. గత కొద్దిరోజులుగా Spider man-3, Shrek-3,Fantastic four-2, Pirates of the Carribean-3 మాత్రమే కాకుండా, అంతకుముందొచ్చిన 28 days [...]
పూర్తిగా చదవండి

స్పస్టత

Teluguwriters, general venkat.siddareddy
వరుసగా మూడు రోజులు శెలవులు రావడంతో ఇంట్లో తిష్టవేసి ఏ సినిమా చూడాలో, ఏ పుస్తకం చదవాలో , ఎలాంటి సినిమాలు తీయాలో, ఏ వీడియో ఎడిట్ చేయాలో ఆలోచిస్తూనే సగం కాలం గదిచిపోయింది. ఈ రెండు రోజుల్లో ఏదైనా ఉపయోగపడే పనేదైనా చేశానంటే అది కేవల నిన్న లండన్ లో సంగీత కచేరికి హాజరుకావటమే! అదేదో సినిమాలో MS నారాయణని “మీరేం చేస్తుంటారు” అని అడిగితే “ఏం చెయ్యాలో ఆలోచిస్తుంటాను” అని చెప్పే సమాధానం గుర్తొచ్చింది. ప్రస్తుతం [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS