Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏడుపు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏమండీ.... నేను చచ్చిపోతే ఏడుస్తారా?" గారంగా అడిగింది భార్య. "హు... ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా సరోజా..." అన్నాడు భర్త.
పూర్తిగా చదవండి

అలవాట్లో పొరపాటు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏవండీ... మీ హోటల్లో మంచి గదులు ఉన్నాయా?" "ఉన్నాయండీ" "మంచి టిఫిన్, కాఫీ..." "supply చేస్తాం సార్" "భోజనం అదీ...." "supply చేస్తాం సార్" "కావాలంటే మందూ..." "supply చేస్తాం సార్" "వెరీ గుడ్... అయితే ఒక రూమివ్వండి." రూమ్‍లో దోమలున్నాయా? "లేవు సార్.... supply చేస్తాం సార్"
పూర్తిగా చదవండి

తొక్క

jandhyala_jokes CH Gowri Kumar
"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని. "ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను. "ముప్పావలాకిస్తావా?" "ముప్పావలాకు తొక్కవస్తుంది." "సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు శివకోటి.
పూర్తిగా చదవండి

వ్యాపారం

jandhyala_jokes CH Gowri Kumar
"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?" అడిగింది కాంతం. "అవునే కాంతం. పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది కనకం.
పూర్తిగా చదవండి

అపరకర్ణుడు

jandhyala_jokes CH Gowri Kumar
"అయ్యా.. నా పేరు సత్యమూర్తి. ఈ చుట్టుపక్కల పది గ్రామాల్లోకెల్లా ధనవంతులు మీరు. మీరు అపర దానకర్ణులని, చేతికి ఎముక లేకుండా దనధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందువల్ల ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి" కోటీశ్వరుడు విశ్వామిత్రతో మొరపెట్టుకున్నాడు. "ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి" అన్నాడా కోటీశ్వరుడు
పూర్తిగా చదవండి

జ్ఞాపకశక్తి

jandhyala_jokes CH Gowri Kumar
"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో . "ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను. "Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ. "Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను. "What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ. "ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!"
పూర్తిగా చదవండి

ముందుగా

jandhyala_jokes CH Gowri Kumar
"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer. "ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.
పూర్తిగా చదవండి

మలుపులు

jandhyala_jokes CH Gowri Kumar
"ఏంటమ్మా ఇది? మీ కథల్లో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు లాంటి వాక్యాలు కనిపిస్తున్నయి?" రచయిత్రి సులోచనతో అన్నాడు ఎడిటర్. "అదేంటి సార్.... కథల్లో ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు?" కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన.
పూర్తిగా చదవండి

గెడ్డం

jandhyala_jokes CH Gowri Kumar
"నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గెడ్డంగీస్తాను. మరి నువ్వురా సుధాకర్" అడిగాడు గోవిందరావు. "ఓ నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్. "ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?" " కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను"
పూర్తిగా చదవండి

పెళ్ళికి తొందర

jandhyala_jokes CH Gowri Kumar
తనకు తొందరగా పెళ్ళి చెయ్యమని, లేకపోతే ఎవరితోనైనా లేచిపోతానని అమ్మాయి warning ఇచ్చిందండీ" విచారంగా చెప్పింది అన్నపూర్ణ. "అప్పుడే ఏం తొందర దాని పెళ్ళికి?" ఆశ్చర్యంగా అన్నాడు సహదేవరావు. "దానికి బట్టలుతుక్కోవడం చాలా శ్రమగా ఉందట" చెప్పింది అన్నపూర్ణ.
పూర్తిగా చదవండి

నిద్ర

jandhyala_jokes CH Gowri Kumar
"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు. "ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.
పూర్తిగా చదవండి

రక్షించండి

jandhyala_jokes CH Gowri Kumar
గండిపేట చెరువు దగ్గర - "రక్షించండి... రక్షించండి... మా అక్క నీళ్ళలో మునిగిపోయింది" పన్నెండేళ్ళ రవి కేకలు పెట్టాడు. వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు. "సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు. "Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి. యువకులు తెల్లముఖాలు వేశారు.
పూర్తిగా చదవండి

ఉత్తరాలు

jandhyala_jokes CH Gowri Kumar
"కేవలం ఉత్తరాలు రాస్తూ బతుకుతున్నావా? నీ ఉత్తరాలు అంత విలువైనవా? ఏ మ్యాగజైన్సుకు?" కుతూహలంగా అడిగాడు ఆంజనేయులు. "అవును. డబ్బు పంపమని మానాన్నకు రాస్తూంటాను" నిబ్బరంగా చెప్పాడు రమణ. (దీన్నే కాస్త modernగా ... "ఏమిటి కేవలం computer మీద బతుకుతున్నావా? బ్లాగులు వగైరా రాస్తున్నావా ఏమిటి?" కుతూహలంగా అడిగాడు రాజ్. "అవును. డబ్బు online transfer చెయ్యమని మా Daddyకి E-mail పంపిస్తూ ఉంటాను" నిబ్బరంగా
పూర్తిగా చదవండి

చినగదు

jandhyala_jokes CH Gowri Kumar
"సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman. "గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు. "అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు" "ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.
పూర్తిగా చదవండి

వయసు

jandhyala_jokes CH Gowri Kumar
"అబ్బ... డాక్టర్ రావు నిజంగా ధన్వంతరే. మాఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని ఒక్క దెబ్బకు పోగొట్టాడు" సంతోషంగా చెప్పాడు చిదంబరం. "ఏం మందిచ్చాడేం?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం. "వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నడు. అంతే! మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచక చేస్తున్నది" అన్నడు చిదంబరం.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS