Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పందెం

jokes నాగరాజా
ఒక సర్దార్జీ, అమెరికన్ విమానంలో పక్క పక్కనే కూర్చున్నారు. అమెరికన్ కు బోర్ కొట్టి సర్దార్జీ తో “సరదాగా ఏదైనా ఆట ఆడదామా?” అన్నాడు. సర్దార్జీ అలసిపోయి ఉండటం చేత మర్యాదగా తిరస్కరించి చిన్న కునుకు తీయడానికి ఉపక్రమించాడు. అయినా అమెరికన్ వదిలిపెట్టకుండా “ఈ గేమ్ చాలా సులభం. చాలా సరాదాగా కూడా ఉంటుంది.” అన్నాడు “ఈ ఆట ఏంటంటే నేనొక ప్రశ్న అడుగుతాను. నువ్వు జవాబు చెప్పలేకపోతే నాకు ఐదు డాలర్లు ఇవ్వాలి. అలాగే నీ ప్రశ్నకు [...]
పూర్తిగా చదవండి

తుది పలుకులు

jokes నాగరాజా
పున్నారావు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడు. బంధువులంతా చుట్టూ చేరారు. పక్కనే ఉన్న స్నేహితుడికి సైగ చేసి ఒక పెన్నూ పేపర్ తెమ్మన్నాడు. సరే ఏదో చివరి కోరిక నోటితో చెప్పలేక రాసి చూపిస్తాడని తెచ్చి ఇచ్చారు. అతి కష్టమ్మీద రెండు వాక్యాలు రాసి ప్రాణాలు విడిచాడు పున్నారావు. సరే చనిపోయిన వెంటనే దాన్ని చదవడం ఎందుకని మడిచి జేబులో పెట్టుకున్నాడా స్నేహితుడు. దహన కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంటికొచ్చి అందులో ఏం రాశాడో [...]
పూర్తిగా చదవండి

ఎవరు చంపగలరు?

jokes నాగరాజా
అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ సీఐఏ కిరాయి హంతకుల అవసరం పడింది. అన్ని పరీక్షలు నిర్వహించి  ముగ్గుర్ని చివరి పరీక్ష కోసం ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు మగవాళ్ళు. ఒక ఆడమనిషి. ఈ పరీక్ష కోసం ముగ్గుర్నీ పెద్ద ఇనుప తలుపు కలిగిన ఒక గది దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ ఆఫీసర్ ఇలా అన్నాడు. మేము మీకిచ్చే ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లోనూ తు.చ తప్పకుండా పాటిస్తున్నారా ?లేదా? అని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. ఆఫీసర్ మొదటి అభ్యర్థికి ఒక గన్ను [...]
పూర్తిగా చదవండి

నువ్వు పైలట్ శిక్షకుడివి కాదా?

jokes నాగరాజా
ఒక విలేఖరికి అడవిలో చెలరేగిన దావానలం ఫోటోలు తీయమని వర్తమానం అందింది. ఆ మంటలు దగ్గరికెళితే ఫోటోలు తీయడానికి వీలు లేనంతగా దట్టంగా పొగ కమ్ముకుని ఉంది. వెంటనే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి ఒక ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకోమన్నాడు. “అలాగే! నువ్వెళ్ళే సరికి ఒక విమానం రెడీ గా ఉంటుంది” అభయమిచ్చాడా సంపాదకుడు. ఆయనన్నట్లుగానే దగ్గర్లో ఉండే విమానాశ్రయానికి వెళ్ళగానే ఒక విమానం అప్పుడే ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. పరిగెత్తుకుంటూ తన సామాగ్రిని లోపల పడేసి [...]
పూర్తిగా చదవండి

వ్యాపారం వ్యాపారమే… :-)

jokes నాగరాజా
గుజరాతీయులు వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులు. వాళ్ళను గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక జోక్. చాలా ఏళ్ళ క్రిందట సౌత్ లండన్ లో ఒక స్కూల్లో ఇంచుమించు ఐదు సంవత్సరాలు వయసుండే పిల్లలకు ఒక టీచర్ పాఠాలు చెబుతోంది. మధ్యలో పిల్లలందర్నీ ఒక ప్రశ్న అడిగింది. ” ఈ భూమ్మీద ఇప్పటి దాకా నివసించిన వాళ్ళలో గొప్ప వాడెవరు? ఈ ప్రశ్నకు కనుక మీలో ఎవరైనా సమాధానం చెబితే మీకు ఇరవై పౌండ్లు ఒక చాక్లెట్ ఇస్తానని ప్రకటించింది. ఒకబ్బాయి లేచి “సెయింట్ [...]
పూర్తిగా చదవండి

తెలివైన ఆలోచన

jokes నాగరాజా
ముగ్గురు ఇంజనీర్లు, ముగ్గురు అకౌంటెంట్లు రైల్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఇంజనీర్లు “మేం ముగ్గురూ ఒకే టికెట్ మీద ప్రయాణిస్తున్నాం తెలుసా?” అన్నారు. “అదెలా సాధ్యం?” అన్నారు ముగ్గురు అకౌంటెంట్లూ ఆశ్చర్యంగా. “మీరే చూడండి” అన్నారు ఇంజనీర్లు. కొద్ది దూరంలో టికెట్ కలెక్టర్ వస్తున్నాడనగా ముగ్గురు ఇంజనీర్లు కలిసి టాయ్‌లెట్ లో దూరారు. టీసీ వచ్చి తలుపు తట్టగానే ఒకరు చెయ్యి బయటి పెట్టి టికెట్ అందించాడు. ఆయన ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ముగ్గురు ఇంజనీర్లు బయటికి రాగానే [...]
పూర్తిగా చదవండి

భార్యా భర్తలకు కోపం వస్తే…

jokes నాగరాజా
ఒక భర్త తన భార్య గురించి చెబుతూ “నా భార్యకి గానీ కోపం వచ్చిందంటే నా మీద, పిల్లల మీద, చివరికి కుక్కల మీద కూడా అరిచేస్తుంది. ఎవ్వరూ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేరు.” “మరి నీకు కోపం వస్తే…” “గోడల వైపు, కిటికీల వైపు తిరిగి గట్టిగా అరిచేస్తా! ఏవీ తిరిగి సమాధానం చెప్పలేవు తెలుసా!!”
పూర్తిగా చదవండి

పిచ్చి తగ్గినట్లు ఎలా తెలుసుకోవాలి?

jokes నాగరాజా
ఆరోగ్య శాఖామంత్రి ఒకసారి పిచ్చాసుపత్రిని సందర్శించడానికి వెళ్ళాడు. మాటల మధ్యలో ఒక డాక్టర్ని అడిగాడు. “ఏమయ్యా! ఒక పేషెంట్ కి పిచ్చి తగ్గిందని మీరు ఎలా పరీక్షిస్తారు?” “దానికో పరీక్ష ఉంది. అదేంటంటే వాళ్ళని నీళ్ళతో నింపిన ఒక స్నానపు తొట్టె (బాత్ టబ్) దగ్గరకు తీసుకెళతాం. వాళ్ళకి ఒక కప్, ఒక స్పూన్ ఇచ్చి తొట్టెలోని నీళ్ళన్నీ బయటికి తోడమంటాం…” “హా అర్థమైంది.. అర్థమైంది… అంటే పిచ్చి తగ్గినవాడు కప్పు పెద్దది కాబట్టి దానితో నీళ్ళని తోడిపోస్తాడన్నమాట” “కాదు సర్. మామూలు [...]
పూర్తిగా చదవండి

నా దగ్గర తాళం ఉంది కదా!

jokes నాగరాజా
ఒక పిచ్చాసుపత్రిలో రోగులు ఎక్కువైపోయారు. ఆసుపత్రిలో వైద్యులంతా కలిసి పిచ్చి కొంచెం నయమైన వారినైనా డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నారు. రోగులందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. అందర్నీ కలిపి ఒక పెద్ద గదిలో కూర్చోబెట్టారు. ఒక డాక్టర్ వెళ్ళి గదిలో ఉన్న పెద్ద బ్లాక్ బోర్డు పైన నిజంగా తలుపేనా అనిపించేలాగా సుద్ద ముక్కతో అందంగా ఒక చిత్రం గీశాడు. తరువాత ఒక డాక్టర్ అందర్నీ ఉద్దేశించి “మీలో ఎవరు వెళ్ళి ఆ తలుపు తెరుస్తారో వాళ్ళకు మంచి ఐస్‌క్రీం [...]
పూర్తిగా చదవండి

బట్లర్ ఇంగ్లీషు గిలిగింతలు

jokes, sweet memories నాగరాజా
ఒక మిత్రుడు మరో మిత్రుడితో “నీకు ఇంగ్లీషు స్పీకింగ్ కమింగా” “నీ ఇంగ్లీషు విన్న తర్వాత ఇప్పుడిప్పుడే గోయింగ్” ****************************************** కొడుకు తండ్రితో…”నాన్నా కాక్ ఈజ్ గోయింగూ” “గోయింగా అయితే పట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ గంప” ****************************************** ఇది మా ఇంజనీరింగ్ కాలేజీలో నిజంగా జరిగింది. ఇద్దరు స్టూడెంట్స్ గొడవలు పడి మా కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ దగ్గరకు వెళ్ళారు. ఒకడు ఆయనతో మాట్లాడుతుంటే మరొకడు మద్యలో అడ్డుపడుతున్నాడు. ఆయన కోపంతో ఇలా అన్నాడు. “he talks, me talks , why you [...]
పూర్తిగా చదవండి

ఎలా ఉంది నా బలం…

jokes నాగరాజా
ఒక పల్లెటూరు వ్యక్తి మొట్ట మొదటి సారిగా బస్సు ఎక్కాడు. డ్రైవర్ వెనకనే ఉన్న సీటులో కూర్చున్నాడు. ఎక్కడం మొదటి సారి కాబట్టి డ్రైవ్ చేయడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేరు ఎలా వేస్తున్నాడు? అంతా విచిత్రంగా ఉంది ఆయనకు. ఒక చోట టీ తాగడానికి బస్సు ఆపి దిగాడు. తిరిగి వచ్చి బస్సు ప్రారంభించాలని గేరు వైపు చూశాడు. అక్కడ లేదు. చుట్టూ చూశాడు. మన పెద్దాయన గేరు చేతిలో పట్టుకుని నవ్వుతూ పక్కనే [...]
పూర్తిగా చదవండి

నా టికెట్ పోయింది…

anecdotes, jokes నాగరాజా
జార్జి బెర్నార్డ్ షా ఒకసారి రైల్లో ప్రయాణిస్తున్నాడు. టికెట్ తనిఖీ చేయడానికి టి.టి.ఇ వచ్చాడు. జార్జి మాత్రం తన టికెట్ కోసం గాబరాగా వెతుకుతున్నాడు. ఆందోళన పడుతున్నాడు. ఆ టికెట్ ఎగ్జామినర్ కి జార్జి బెర్నార్డ్ షా గురించి బాగా తెలుసు. “సర్లెండి సార్! మీరు టికెట్ తీసుకునే ఉంటార్లెండి. ఎక్కడో పెట్టుకుని మర్చిపోయింటారు. పర్లేదు” అన్నాడు “అది కాదయ్యా బాబూ! నేనెక్కడ దిగాలో మరిచిపోయాను!!! అది ఆ టికెట్లోనే ఉంది మరి” [...]
పూర్తిగా చదవండి

నీకేమనిపిస్తోంది?

jokes నాగరాజా
ఇద్దరు పెద్ద మనుషులు ఒక క్యాంపు కోసం బయటకు వెళ్ళారు. రాత్రి సుష్టుగా భోంచేసి వెంట తెచ్చుకున్న గుడారం వేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ నిద్రపోయారు. కొద్దిసేపటి తర్వాత ఒకాయనకు మెలుకువ వచ్చింది. రెండో అతన్ని నిద్ర లేపి “ఈ ఆకాశం, ఈ నక్షత్రాలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది?” అని అడిగాడు. “లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి” అన్నాడు. “అది సరే వాటి నుంచి నువ్వేమి తెలుసుకున్నావు?” “జ్యోతిష శాస్త్రం ప్రకారం శని సింహ రాశిలో ప్రవేశిస్తున్నాడు” “ఖగోళ శాస్త్రం ప్రకారం మిల్లియన్ల కొద్దీ పాలపుంతలు, బిలియన్ల [...]
పూర్తిగా చదవండి

పెట్టె బయట ఆలోచించడం అంటే ఇదేనేమో!!!

jokes నాగరాజా
ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న తప్పుగా వచ్చింది. ఈ క్రింది సమీకరణాన్ని నిరూపించండి. 2/10=0.2 అనేదానికి బదులు 2/10=2 అని అచ్చయింది. ఒక అభినవ బృహస్పతి దాన్ని ఇలా నిరూపించాడు, 2 = TWO, 10 = TEN TWO / TEN = WO / EN W = 23, O = 15 (అక్షరక్రమం ప్రకారం) E=5, N=14 (”) W+O= 23+15 = 38 E+N= 5+14 = 19 కాబట్టి, 38 / 19 = 2 అని నిరూపించబడినది. సో అదన్న [...]
పూర్తిగా చదవండి

ఈ-మెయిల్ పొరపాటు

Uncategorized, jokes నాగరాజా
ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు. రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు. కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ శబ్దం వినగానే [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS