Can't see Telugu? Learn here. More Questions? Ask here.

No country for old men

Coen brothers, Hollywood, Movies, పద్యం, శార్దూలం Giri
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై, ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో! కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత
పూర్తిగా చదవండి

త్యాగయ్య ఆనంద భైరవి - రుద్రవీణ బిలహరి

Movies, Music vbsowmya
ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక - “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ [...]
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ.. -2

Movies, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. దుష్ట సమాసముల్, తగని తుఛ్ఛపు సంకర జాడ్య మౌఢ్య భూ యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్ తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా, భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!
పూర్తిగా చదవండి

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..

Movies, పద్యం, శార్దూలం Giri
శా. ఏంట్రా నీకిది కొంచెమైన సబబా? ఇట్లాంటి సాహిత్యమా? కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.
పూర్తిగా చదవండి

కృష్ణ

Movies, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. బుట్టలో పడిపోతినే, అరె! బొత్తిగా మతి పోయెనా? వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్ తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా? జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక.. “Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director
పూర్తిగా చదవండి

Jodhaa Akbar

Movies, చంపకమాల, పద్యం Giri
ఉ. ఉల్లములెల్లనుల్లసమునొందగ, (భారత దేశమందు వర్థిల్లిన రాచవీరుని గురించి నిజాలను కొంత మార్చినా)తొల్లిటి వైభవాలు, కదనోద్యమ భేరులు, వీనువిందుగాకళ్ళు జిగేలనే విధముగా తెరకెక్కెను జోధ అక్బరై వివరాలు నవతరంగంలో రాసాను, వీలు దొరికినప్పుడు చదవండి.
పూర్తిగా చదవండి

Blame it on the audience

Movies, తెలుగు, తేటగీతి, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. రాఘవా విను, ఛీత్కరించి పరాభవించిననూ విది ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి తాము తీసిన చెత్త చిత్రవధలకు త టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక
పూర్తిగా చదవండి

Don? Don’t!

Movies, ఉత్పలమాల, తెలుగు, పద్యం Giri
ఉ. దండిగ డబ్బుచేసుకొని నవ్వుతు బాంకుకి పోవుటెంత బా గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్ దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా? ==== ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా రెన్సు ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా (పాపము ప్రేక్షక
పూర్తిగా చదవండి

Ratatouille

Hollywood, Movies, ఉత్పలమాల, పద్యం Giri
ఉ. లొట్టలు వేసి జిహ్వ చవులూరెడి పాకము చేయబూనెనో చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.
పూర్తిగా చదవండి

Bee Movie

Hollywood, Movies, పద్యం, మత్తకోకిల Giri
నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు
పూర్తిగా చదవండి

Bee Movie

Hollywood, Movies, పద్యం, మత్తకోకిల Giri
నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు
పూర్తిగా చదవండి

గుండమ్మపై సీసము

Movies, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తేటగీతి, పద్యం, సీస పద్యం Giri
సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము పెంకిదయ్యెనది ఆ పెంపకాన సవతి కూతిరినెల్ల సాధింప వేధింప పనిమంతురాలయ్యె పసితనాన గారాల పట్టికి మారాజు కావలె ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ ఆ. వె. అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు వరుల వేటజేయబట్టె తానె, మగని తోడులేని బండమ్మ, గుండమ్మ అన్న గారి సాయమందు కొంచు కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే.. ఆ. వె. పైకి
పూర్తిగా చదవండి

Om Shanti Om

Movies, తేటగీతి, పద్యం, శార్దూలం Giri
శా. మైహూనా - చవి చూపి చెత్తను, శిరోభారమ్ము పెంచేయగా నా హూనంబయినట్టి బుఱ్ఱకు ప్రమాణంబిస్తి, మళ్ళీ ఫరా కాహారంబెపుడూ తనవ్వదని; వాగ్దానాలు కల్లల్ కదా, ఆహా, నేడు సమీక్షలన్ చదివి, హైహై యంటి ఓంశాంతిఓం తే.గీ. చిత్రమును చూడ పంతము చేయ బుద్ది తానె గడ్డి మేసినదై; ఇదంత మీకు చెప్పు కారణమేమన, పప్పులోన కాలు పడకముందె నను ఆపాలి తమరె.మీలో ఎవరైనా ఈపాటికి ఓం శాంతి ఓం చూసి ఉంటే, పై పద్యంలోని 'మీరు' మీరే. Reviews
పూర్తిగా చదవండి

తేట తెలుగు పలుకు

Movies, Music, ఆటవెలది, ఉత్పలమాల, తెలుగు, తెలుగు భాష, పద్యం Giri
కొత్తపాళీ గారు,. రానారె గారు వ్రాసిన తెలుగులో బీభత్సానికి నా జోడింపు. ఉ. వాళ్ళకి వాల్లు; కళ్ళకట మారును కల్లుగ; హవ్వ! వాణియా నోళ్ళబడంగ వానియగు; నోళ్ళిక నోల్లయినిల్వ నిట్టి యా రళ్ళవె కర్ణభేరులకు ఱంపపుకోతల కూతలవ్వ, యె న్నాళ్ళు భరించుటంచు చెడునాల్కెలనెల్లను చీరివేతువా? ఆ.వె. సల్పవచ్చునట్టి సాహసము తెగించి తప్పులేదు కాని తరచి చూడ మూగవారు తప్ప మిగలరెవ్వరు మరి చివరకు మన చిత్రసీమలోన* చిత్రసీమ అని
పూర్తిగా చదవండి

Akira’s Red Beard

Movies Giri
Red beard is the sixteenth one in a string successful, internationally recognized movie collaborations of Akira Kurosawa and Toshiro Mifune and also their last one together - neither managed to achieve the same level of success after parting ways. Kurosawa's movies after Red Beard, never again had a powerful hero, the type typified on screen by Mifune. He turned towards darker themes – even his
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS